PLD: దుర్గి మండలంలో కలెక్టర్ కృతికా శుక్లా శుక్రవారం పర్యటించారు. దరివేముల గ్రామంలోని బుగ్గవాగు రిజర్వాయర్లో నీటి నిల్వలు, సాగునీటి పరిస్థితులు, ఇంజినీరింగ్ పనులను ఆమె పరిశీలించారు. అనంతరం జాతీయ హస్తకళల వారోత్సవాలలో భాగంగా, లేపాక్షి ఎంపోరియం ఆధ్వర్యంలో 30 మంది కళాకారులకు స్టోన్ కార్వింగ్పై ప్రారంభమైన రెండు నెలల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.