కృష్ణా: మచిలీపట్నం ఆదిత్య డిగ్రీ కాలేజీలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్య అధికారి డా. శ్రీవాణి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా టీడీపీ పార్టీ రాష్ట్ర నాయకులు గోపిచంద్, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పి.వి. ఫణి కుమార్ హాజరయ్యారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో రక్తదానం చేశారు.