VZM: ఈ నెల 24న జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్ ఆదేశించారు. దీనిలో భాగంగా ఈనెల 18 నుంచి వారోత్సవాలను నిర్వహించాలని సూచించారు. జాతీయ వినియోగదారుల దినోత్సవంపై తమ ఛాంబర్లో సంబంధిత అధికారులు, సభ్యులతో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు.