కోనసీమ: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈరోజు ఉదయం టూరిస్ట్ బస్సు లోయలో పడి పలువురు మృత్యువాత పడిన విషాద ఘటనపై మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో చాలా మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, చాలామంది తీవ్రంగా గాయపడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు సుభాష్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.