VZM: ప్రజా సమస్యల పరిష్కార దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అన్నారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆమె పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.