MNCL: మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామా చేసి బీసీ ఉద్యమంలోకి రావాలని బీసీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు చేరాల వంశీ డిమాండ్ చేశారు. శుక్రవారం మంచిర్యాలలో నిర్వహించిన సాయి ఈశ్వరచారి ఆశయసాధన, రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, 9వ షెడ్యూల్లో చేర్చాలన్నారు.