మొక్కజొన్న విక్రయాలు జరిపిన రైతుల బ్యాంకు ఖాతాలలో ప్రభుత్వం తొలి విడత డబ్బులు జమ చేసిందని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. జిల్లాలోని రైతులకు తొలి విడతగా రూ. 10.00 కోట్ల నిధులు విడుదలయ్యాయన్నారు. మార్క్ఫెడ్ ద్వారా జిల్లాలో 33 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, 2,63,016 క్వింటాళ్ల మొక్కజొన్నను సేకరించినట్లు కలెక్టర్ వెల్లడించారు.