KDP: కొండాపురం మండలం ఓబన్నపేటలో శుక్రవారం ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని DLDA ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ రాజ తిమ్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశువులు ఎదకు వచ్చినప్పుడు వాటి ఎద లక్షణాలు గుర్తించడం, ఏ సమయంలో ఎదసూది వేయించాలి, లింగ నిర్ధారిత వీర్యం గురించి రైతులకు వివరించారు.