ATP: ఎల్లనూరు గ్రామ సమీపంలో శుక్రవారం ఇసుక తరలిస్తున్న టిప్పర్ అదుపుతప్పి పంట పొలాల్లో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో టిప్పర్ లో ఉన్న డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. గత కొన్ని రోజులుగా అడవి ప్రాంతం నుంచి ఇసుకను అధిక లోడుతో తరలిస్తున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.