TG: హైదరాబాద్ వాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కామన్ మొబిలిటీ కార్డ్ త్వరలో అందుబాటులోకి రానుంది. దీంతో ఒకే కార్డుతో మెట్రో, RTC బస్సుల్లో టికెట్ రహిత ప్రయాణం సాగించవచ్చు. ఈ కార్డును 2023 ఆగస్టులోనే ప్రవేశపెట్టాలని నిర్ణయించగా, ఇప్పటివరకు పూర్తి అమలు కాలేదు. మెట్రో, RTC విజయవంతంగా అనుసంధానమైన తర్వాత.. MMTS రైళ్లు, ఇతర వాహనాలకూ దీన్ని విస్తరించే అవకాశముంది.