ఉపాధి హామీ పథకం పేరు మార్పునకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రోజు భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం.. గతంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా ఉన్న ఈ స్కీమ్ పేరును పూజ్య బాపు గ్రామీణ ఉపాధి హామీ పథకంగా మార్చింది. ఈ సందర్భంగా ఏడాదికి 120 పని దినాలను తప్పనిసరి చేసింది. ఇందుకోసం రూ.లక్షా 51 వేల కోట్లను కేటాయించింది.