ELR: అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూనే యువత తమ జీవితాలను ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సూచించారు. ఏలూరులోని సర్ సీఆర్ రెడ్డి కళాశాల ఆడిటోరియంలో శుక్రవారం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ – మెప్మా, నిపుణ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్‌మేళాను నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లోని 21 ప్రముఖ కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.