»Gangster Chhota Rajan Gang Member In Custody Of Mumbai Police Accused In 1994 Case
Chhota rajan: గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్ ముఠా సభ్యుడు అరెస్ట్
చోటా రాజన్ ముఠా అంటే 1990లలో ముంబై వణికిపోయేది. ఆయన గ్యాంగ్ చేసే పనులకు పోలీసులు తలలు పట్టుకోవల్సిన పరిస్థితి. అలాంటి ముఠాలోని ఒక వ్యక్తిని తాజాగా ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 28 ఏళ్ల నుంచి తప్పించుకు తిరుగుతూ ఈ రోజుకి పోలీసులకు చిక్కాడు.
Gangster Chhota Rajan gang member in custody of Mumbai police accused in 1994 case
Custody ముంబయి(Mumbai) నేర సామ్రాజ్యంలో చోటా రాజన్(Chota Rajan) పేరు చెబితే దావుద్ ఇబ్రహిం పేరు కూడా ప్రస్థావనకు వస్తుంది. ఇద్దరు ఒకటిగా చేసిన ఎన్నో నేరాల తరువాత విడిపోయి చేసిన దారుణాలు చాలానే ఉన్నాయి. ఇక వీరి గ్యాంగులు చేసే పనులను అక్కడి నగర వాసులు హడలిపోయేవారు. అలాంటి ఒక వ్యక్తిని తాజాగా ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 28 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న గ్యాంగ్‌స్టర్(Gangstar) చోటా రాజన్ ముఠా సభ్యుడిని శనివారం పోలీసులు అరెస్టుచేశారు. 1994 నాటి దోపిడీ కేసులో నిందితుడైన సబీర్ బర్కతాలి లఖానీ ఇన్ని రోజులు పోలీసులకు దొరక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ముంబై నగరంలోని ఆంటోప్ హిల్ ప్రాంతానికి చెందిన 59 ఏండ్ల సబీర్ బర్కతాలి లఖానీ చోటా రాజన్ గ్యాంగ్‌లో సభ్యుడు.
1994లో తన నలుగురు సహచరులతో కలిసి ముంబై చెంబూరులోని సింధీ క్యాంప్‌లోని ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ కార్యాలయంలో దోపిడీ చేయాలనే ఉద్దేశంతో ఆయుధాలతో చొరబడ్డారు. విధి నిర్వహణలో ఉన్న క్రైమ్ బ్రాంచ్ అధికారిపై కూడా దాడి చేశాడు. ఈ కేసులో నాటి నుంచి తప్పించుకు తిరుగుతున్న బర్కతాలి లఖానీ గుజరాత్‌లోని సూరత్‌లో పట్టుకున్నట్టు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శనివారం వెల్లడించారు. ఈ కేసు విషయంలో దర్యాప్తు జరుపుతున్నట్టు వెల్లడించారు. ఇక చోటా రాజన్ ప్రస్తుతం ఢిల్లీ తీహర్ జైల్లో జీవితఖైదు శిక్షను అనుభవిస్తున్నాడు. 2017లో నకిలీ పాస్ పోర్ట్ కేసులో రాజన్‌కు ఏడేళ్ల కఠిన కారాగార శిక్షను విధించగా, 2018లో జర్నలిస్ట్ హత్య కేసులో రాజన్‌కు జీవిత ఖైదు పడింది.