»Three Killed In Plane Crash In Canada British Columbia Two Of Them Indians
Plane crash: విమానం కూలి ముగ్గురు మృతి..వారిలో ఇద్దరు ఇండియన్స్
కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో శనివారం జరిగిన విమాన ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత చెందగా..వారిలో ఇద్దరు భారతీయ ట్రైనీ పైలట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పైలట్లు అభయ్ గాడ్రూ, యశ్ విజయ్ రాముగాడే ముంబైకి చెందినవారని పేర్కొన్నారు.
Three killed in plane crash in Canada British Columbia Two of them Indians
కెనడా(Canada)లోని బ్రిటిష్ కొలంబియా(British Columbia)లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. వాంకోవర్‌కు తూర్పున 100 కిలోమీటర్ల దూరంలో పీఏ-34 సెనెకా(PA-34 Seneca) అనే ట్విన్ ట్రైనింగ్ ఫ్లైట్ చెట్లపొదల్లో కూలిపోయినట్లు గుర్తించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించగా..వారిలో ఇద్దరు భారతీయులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వాంకోవర్‌కు తూర్పున 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిల్లివాక్లోని స్థానిక విమానాశ్రయానికి సమీపంలో ఈ ఘటన జరగింది. నివేదికల ఆధారంగా కెనడా రవాణా భద్రతా బోర్డు ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి అధికారులను పంపించింది.
పైలట్ సహా ఇతర ఇద్దరు ప్రయాణీకులు అందరూ మరణించారు. రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు బాధితుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ముంబయికి చెందిన అభయ్ గద్రూ, యశ్ విజయ్ రాముగడె ఉన్నారని తెలుస్తోంది. అంతేకాదు వీరిద్దరూ ఒకే ఫ్యామిలీకి చెందిన వారని అక్కడి మీడియా తెలిపింది. అయితే అసలు ప్రమాదం ఎలా జరిగిందనే విషయం తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఘటనా స్థలానికి వెళ్లిన అధికారులు(officers) పలు రకాలుగా వివరాలను ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు.