»Cyber Cheaters Cheat Woman On The Name Of Amma Vodi
Amma Vodi డబ్బులిస్తామని మోసం.. కొత్త పుంతలు తొక్కిన ఆన్ లైన్ ఛీటింగ్
సైబర్ నేరగాళ్లు కొత్త టెక్నిక్ ఉపయోగిస్తున్నారు. అమ్మ ఒడి పథకానికి అర్హత సాధించారని మాట కలుపుతున్నారు. అలా నమ్మి ఇద్దరు ముగ్గురు ఓటీపీ, లింక్ క్లిక్ చేసి ఉన్న డబ్బులను పోగొట్టుకున్నారు.
Amma Vodi: అమాయకులే వారి టార్గెట్.. దానికితోడు లాటరీ వచ్చిందని చెప్పి అట్రాక్ట్ చేస్తుంటారు. ఇప్పుడు కేటుగాళ్లు కూడా మారిపోయారు. ప్రభుత్వ పథకాల పేరు చెప్పి మరీ ఛీటింగ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒమ్మ ఒడి పథకం వచ్చిందని ఆశ చూపించారు. అలా పలువురు మహిళలను మోసం చేశారు. వాలంటీర్ మాట్లాడుతుండగానే.. మరో కాల్ వస్తోంది. మా సార్ మాట్లాడతారు అని చెప్పి.. వాలంటీర్ ఫోన్ కట్ చేస్తారు. ఆ సార్.. అదీ ఇదీ చెప్పి.. ఖాతాలో ఉన్న డబ్బులను లాగేస్తున్నాడు.
లబ్ధికారులకు న్యాయం చేయాలంటూ..
ఎన్నికల సమయం అని.. లబ్దిదారులకు న్యాయం చేయాలని సీఎం అమ్మ ఒడి పథకం లబ్దిదారులకు న్యాయం చేయాలని సూచించారని చెబుతున్నారు. నిజమే అనుకొని వారు అడిగిన వివరాలు చెప్పేస్తున్నారు. తమ ఖాతాలో నగదు జమ చేస్తారని భావిస్తున్నారు. అలా వారు అడిగిన బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఓటీపీ చెబుతున్నారు. అలా ఇద్దరు, ముగ్గురు ఓటీపీ కూడా చెప్పేశారు. అలా ఇద్దరు మోస చేశారు. తర్వాత లబోదిబో మన్నారు.
కొత్త పుంతలు
ఇదివరకు బ్యాంక్ యాప్ అప్ డేట్, కేవైసీ, పార్ట్ టైమ్ జాబ్, టాస్క్ పూర్తి చేస్తే అధిక నగదు పేరుతో మోసం చేసేవారు. ఇప్పుడు వాలంటీర్ల ద్వారా అమ్మ ఒడి ఆన్ లైన్ మోసాలు జరుగుతున్నాయి. కొత్త వ్యక్తి పోన్ చేసి వివరాలు అడిగితే సందేహిస్తామని.. ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా వాలంటీర్‌తో తనకు అన్నీ చెప్పేలా మాట్లాడించి.. లైవ్‌లో వాలంటీర్లను కట్ అయిపోమని చెప్పి ఛీట్ చేస్తున్నారు. రాజమండ్రికి చెందిన కంబాల చెరువు ప్రాంతానికి చెందిన కే రత్నకుమారి గత నెల 18వ తేదీన ఫోన్ వచ్చింది.
మరో కాల్
అప్పటికే డివిజన్ వాలంటీర్‌తో మాట్లాడుతోంది. అమ్మ ఒడి పథకానికి సంబంధించిన వివరాల కోసం సర్ మాట్లాడతారని చెప్పి లైన్ నుంచి వెళ్లిపోయాడు. అమ్మ ఒడి పథకానికి సంబంధించి నగదు మంజూరయ్యిందని.. బ్యాంకు ఖాతా వివరాలు కావాలని కోరారు. డేటా ఇవ్వకుంటే నగదు వెళ్లిపోతుందని చెప్పాడు. అకౌంట్ వివరాలు.. ఓటీపీ కూడా చెప్పేశారు. దీంతో బ్యాంక్ రూ.42 వేలు డెబిట్ అయ్యింది. కాసేపటికి మరో ఓటీపీ వచ్చింది. అది చెప్పాలని అనడంతో.. మోసపోయానని గ్రహించి మొబైల్ స్విచ్ఛాప్ చేసింది. బ్యాంక్ వద్దకు వెళ్లగా.. పోలీసు స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలని కోరగా.. అదే నెల 28వ తేదీన ఫిర్యాదు చేసింది.
ఫోన్ పే లింక్ క్లిక్ చేసి
రాజమండ్రి గ్రామీణం గణేశ్ నగర్‌కు చెందిన అనుకి కూడా ఇలాంటి అనుభవం ఎదురైంది. ఈ నెల 1వ తేదీన వాలంటీర్ లైన్లో ఉండగా.. మరొకరు లైన్లోకి వచ్చారు. రెండేళ్లకు సంబంధించి అమ్మ ఒడి పథకం అర్హులయ్యారని.. రూ.26 వేల నగదు బ్యాంక్ ఖాతా వివరాలు తెలియజేస్తే పంపిస్తానని నమ్మించాడు. ఆమె కూడా నమ్మింది. ఫోన్ పే లింక్ పంపించి క్లిక్ చేయమని చెప్పగా.. క్లిక్ చేసి పిన్ నంబర్ ఎంటర్ చేసింది. అకౌంట్ నుంచి రూ.26 వేల నగదు ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆమె కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివరాలు చెప్పొద్దు
ఫోన్ చేసి వివరాలు అడిగితే ఇవ్వకూడదని సైబర్ నిపుణులు సూచించారు. ఓటీపీ చెప్పొద్దని, లింక్ క్లిక్ చేయొద్దని మరీ మరీ చెబుతున్నారు. ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని.. మోస పోతే 48 గంటల్లో 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని కోరారు. ఐటీ కోర్ పోలీసులు సైబర్ మోసగాళ్ల బ్యాంక్ అకౌంట్ స్తంభింపజేసి.. నగదు వెనక్కి వచ్చేలా చేస్తారని తెలిపారు. రూ.15 వేలకు పైగా నగదు అయితే వీరికి.. అంతకంటే తక్కువ మొత్తం అయితే జాతీయ సైబర్ నేరాల పోర్టర్లో కంప్లైంట్ చేయాలని కోరారు. సో.. అపరిచితులు కాల్ చేసి లింక్ ఓపెన్ చేయాలని అడిగినా.. ఓటీపీ చెప్పాలని కోరినా.. ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దని సూచించారు.