VSP: కంచరపాలెం, పెందుర్తి స్టేషన్లలో నమోదైన 2 మిస్సింగ్ కేసులను పోలీసులు విజయవంతంగా ఛేదించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు త్వరితగతిన విచారణ చేపట్టి వివరాలు సేకరించారు. సీసీ ఫుటేజీ, ఫోన్ ట్రాకింగ్‌తో మిస్సింగ్ వ్యక్తుల్ని గుర్తించి శుక్రవారం వారి వారి కుటుంబాలకు సురక్షితంగా అప్పగించారు. ఈ సందర్భంగా సీపీ శంఖబ్రత బాగ్చి సిబ్బందిని అభినందించారు.