»Scientists Who Said Good News Solar Airship That Does Not Need Fuel Is Ready
Solar Airship: గుడ్‌న్యూస్ చెప్పిన శాస్త్రవేత్తలు..ఇంధనం అవసరం లేని సోలార్ ఎయిర్‌షిప్ రెడీ
ఇంధనం అవసరం లేకుండా ప్రపంచాన్ని చుట్టి వచ్చే వాహనాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. దీని ద్వారా 40 వేల కిలోమీటర్ల ప్రయాణాన్ని కేవలం 20 రోజుల్లోనే పూర్తి చేయొచ్చు. అంతేకాకుండా విమానం కంటే 10 రెట్ల సరుకును ఈ వాహనం ద్వారా రవాణా చేయొచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఇప్పుడు ప్రతి వాహనం నడవాలంటే ఇంధనం కచ్చితంగా కావాలి. అయితే ఇంధనం అవసరం లేని వాహనాన్ని రూపొందించేందుకు శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా ఈ విషయంలో శాస్త్రవేత్తలు గుడ్‌న్యూస్ చెప్పారు. ఏ ఇంధనం అవసరం లేకుండానే సున్నా ఉద్గారాలతో పనిచేసే సోలార్ ఎయిర్‌షిప్‌ను రూపొందించారు. ఈ వాహనంతో ప్రపంచాన్నే చుట్టేసి రావొచ్చు. ఇది భూమధ్య రేఖ చుట్టూ దాదాపు 40 వేల కిలోమీటర్ల ప్రయాణాన్ని కేవలం 20 రోజుల్లోనే చుట్టేసి వస్తుంది.
495 అడుగుల పొడవున్న ఈ ఎయిర్‌షిప్ ఉపరితలం మొత్తం సోలార్ ఫిల్మ్‌తో కప్పి ఉండేటట్లు రూపొందించారు. సోలార్ ఫిల్మ్ ద్వారా సూర్యరశ్మిని స్వీకరించి ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్స్ ద్వారా ఎయిర్‌షిప్ నడుస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అలాగే పగలు తయారు చేసిన అదనపు విద్యుత్‌ను హైడ్రోజన్‌గా మార్చడంతో రాత్రిపూట కూడా దాని ప్రయాణానికి ఏ ఆటంకం కలగదు. ముగ్గురు సిబ్బందితో ఈ వాహనాన్ని నడపవచ్చు. ఈ ఎయిర్‌షిప్ గంటకు 83 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడమే కాకుండా ఒక కార్గో విమానం కంటే 8-10 రెట్ల సరుకును రవాణా చేయగలుగుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.