»Young Man Who Grew His Hair Guinness World Record With 146 Cm
Video Viral: జుట్టును పెంచిన యువకుడు..146 సెంటీమీటర్లతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్
ఓ 15 ఏళ్ల అబ్బాయి ఒక్కసారి కూడా కటింగ్ చేయించుకోలేదు. దీంతో అతని జుట్టు ఏకంగా 146 సెంటీమీటర్లు పెరిగింది. ఇప్పుడు ఆ జుట్టే ప్రపంచ రికార్డు సాధించేలా చేసింది.
ఓ యువకుడు 146 సెంటీమీటర్లు జుట్టును పెంచి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడు. ఈ విషయాన్ని గిన్నిస్ బుక్ యాజమాన్యం తన సోషల్ మీడియాలో అకౌంట్లో షేర్ చేసింది. 15 ఏళ్ల సిదక్‌దీప్ సింగ్ చాహల్ ఈ ఘనతను సాధించాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సిదక్‌దీప్ సింగ్ చాహల్ చిన్నప్పటి నుంచి తన జుట్టును కత్తించుకోకపోవడం విశేషం. చిన్నవాడైన అతన్ని ఎవరైనా చూస్తే అమ్మాయే అని అనుకుంటారు. కానీ ఇప్పుడు అతను సాధించిన ఘనతతో ఫేమస్ అయిపోయాడు.
ప్రపంచంలోనే అతి పొడవైన జుట్టున్న కుర్రాడిగా సిదక్‌దీప్ సింగ్ చాహల్..గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ 2024లో చోటును సంపాదించుకున్నాడు. ఈ విషయాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అధికారికంగా వెల్లడించింది. అతనికి సంబంధించిన ఓ వీడియోను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సిదక్ దీప్ సింగ్ తన జుట్టును వారంలో రెండు సార్లు శుభ్రం చేసుకుంటాడు. అతను తన జుట్టును వాష్ చేసుకోవడానికి ఏకంగా గంట సమయం పడుతుంది. సిదక్ దీప్ సిక్కు మత సంప్రదాయాలను పాటిస్తాడు. అందుకే చిన్నప్పటి నుంచి జుట్టు కత్తించుకోలేదని చెబుతాడు. 15 ఏళ్లలో అతను ఒక్కసారి కూడా కటింగ్ చేసుకోలేదు. దీంతో అతని జుట్టు 146 సెంటీమీటర్లు పెరిగింది. ఆ జుట్టే ఇప్పుడు అతనికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది.