»Microplastics Shocking Plastic Pieces Even In The Clouds
Microplastics : షాకింగ్..మేఘాల్లో కూడా ప్లాస్టిక్ ముక్కలు!
ప్లాస్టిక్ భూతం వల్ల పర్యావరణం నాశనం అవుతోంది. ఈ ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరగడంతో సముద్రాలు కలుషితం అయ్యాయి. తాజాగా మేఘాల్లో కూడా ప్లాస్టిక్ కణాలు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ షాకింగ్ విషయం అందరిలోనూ అలజడిని రేపుతోంది.
మనిషి తన స్వార్థం కోసం పర్యావరణాన్ని పాడు చేస్తున్నాడు. రోజురోజుకూ పచ్చదనం దూరం అవుతోంది. ఇప్పటి వరకూ అతి విలువైన మొక్కలు నామరూపం లేకుండా పోతున్నాయి. పర్యావరణ శాస్త్రవేత్తలు (Environmental scientists) ఎన్ని సూచనలు చేస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ప్లాస్టిక్ వాడకం ఎక్కువవ్వడం వల్ల అనేక మంది తమ ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నారు. విపరీతమైన ప్లాస్టిక్ వాడకం (Using Plastic) పర్యావరణానికి పెనుముప్పుగా మారింది.
తాజాగా జపనీస్ పరిశోధకులు పర్యావరణానికి సంబంధించిన మరో షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. గత కొన్ని రోజుల నుంచి ప్లాస్టిక్ వాడకం భారీగా పెరిగింది. ఆ ప్లాస్టిక్ కణాలను మేఘాల్లో కూడా గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. జపనీస్ శాస్త్రవేత్తలు (Japaniese Scientists) మేఘాల్లో (Clouds) మైక్రోప్లాస్టిక్‌ను (Micro Plastics) గుర్తించినట్లు వెల్లడించారు. మౌంట్ ఫుజి, మౌంట్ ఒయామా పర్వతాలపై పొగమంచు నుంచి పరిశోధకులు నీటిని సేకరించారు. ఆ నీటిని అడ్వాన్స్ ఇమేజింగ్ టెక్నాలజీ ద్వారా వాటి భౌతిక, రసాయనిక స్థితిగతులను అంచనా వేశారు.
ఆ పొగమంచు మేఘాల (Clouds) నీటి నమూనాలో 9 రకాలైన మైక్రోప్లాస్టిక్‌లు ఉన్నట్లుగా పరిశోధకులు గుర్తించారు. ఆ మైక్రోప్లాస్టిక్ పరిమాణం 7.1 నుంచి 94.6 మైక్రో మీటర్లు ఉన్నట్లుగా తెలిపారు. మేఘాల్లోని ఒక్కో లీటర్ నీటిలో 6.7 నుంచి 13.9 ప్లాస్టిక్ ముక్కలు (Plastic cubes) ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ప్లాస్టిక్ వాయుకాలుష్యంపై అందరూ అలర్ట్ కాకుంటే భవిష్యత్తులో తీవ్రమైన పర్యావరణ నష్టం వాటిళ్లే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరించారు.
ప్లాస్టిక్ (Plastic) వల్ల ఇప్పటికే సముద్రాలు (Sea’s) చాలా వరకూ నష్టపోయాయని, కొన్ని రకాల సముద్ర జీవులు (Sea Animals) ఆ ప్లాస్టిక్ మహమ్మారి వల్ల పూర్తిగా నాశనం అయ్యాయని, ఇది ఎక్కువైతే రాబోయే రోజుల్లో ప్రజల మనుగడ కష్టమని జపనీస్ పరిశోధకులు హెచ్చరించారు. వెంటనే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణానికి మేలు చేయాలని, మొక్కలను పెంచి పోషించాలని సూచించారు.