కిరాయి సైన్యం వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ (Prigogine) మరణించడంతో ఆ గ్రూపు వాలంటీర్ యూనిట్స్ బాధ్యతలను ఆండ్రి ట్రోషెవ్‌ను రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) అప్పగించారు. ఈయననే త్వరలో చీఫ్ గా నియమిస్తారని సమాచారం. ఉక్రెయిన్‌తో యుద్ధంలో చురుగ్గా పాల్గొనేలా సేనలను సిద్ధం చేయాలని ఆదేశించారు. గతంలో వాగ్నర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ట్రోషన్(Trotion).. సిరియా యుద్ధంలో పనిచేశారు. ఇతనిపై EU నిషేధం విధించింది.కాగా, వాగ్నర్ గ్రూపు కొత్త అధ్యక్షుడు ఈ సైనిక దళంలోనే పలు స్థాయిల్లో పనిచేశారు. వాగ్నర్ గ్రూపు ముఖ్య కమాండర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలోనే ఈ మిలిటరీ దళం బాధ్యతలను పుతిన్ ఆండ్రీకి అప్పగించారు. ఆండ్రీ గతంలో రష్యా (Russia)సైన్యంలో కూడా పనిచేశారు. 2014లో వాగ్నర్ గ్రూపులో చేరారు. గ్రూపు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో సిరియాలో పోరాట కార్యకలాపాలను పర్యవేక్షించారు. ఆండ్రీపై ఐరోపా సమాఖ్య అనేక ఆంక్షలు విధించింది. ప్రస్తుతం ఉక్రెయిన్(Ukraine)లో పోరాడుతున్న వాగ్నర్ గ్రూపు దళాల పర్యవేక్షణ బాధ్యతను పుతిన్ ఆండ్రీకి అప్పగించారని అక్కడి వర్గాలు తెలిపాయి