ప్రముఖ టెక్ వ్యాపారవేత్త టెస్లా అధినేత, ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk)ఏ పని చేసిన విశేషమే. ఆయన తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. మస్క్ అసాల్ట్ రైఫిల్(Assault rifle) తో షూటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మస్క్ స్వయంగా ఈ వీడియోను షేర్ చేశారు. ‘50 క్యాలిబర్ బ్యారెట్ రైఫిల్‌తో హిప్ ఫైరింగ్ (Firing) చేస్తున్నా’ అంటూ ఓ క్యాప్షన్‌తో ఆయన ఈ వీడియోను షేర్ చేశారు.ఈ వీడియోలో మస్క్.. యాక్షన్ హీరో లెవల్లో ఫోజులిస్తూ ఫైరింగ్ చేస్తూ కనిపించారు.26 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్ల(Netizens)ను విశేషంగా ఆకట్టుకుంటోంది. కాగా, మస్క్ గతంలోనూ తుపాకీల ఫొటోలను నెట్టింట షేర్ చేసిన విషయం తెలిసిందే.
గతేడాది నవంబర్ 22వ తేదీన ఆయన తన మంచం పక్కన టేబుల్‌పై సాఫ్ట్‌డ్రింక్స్, రెండు పిస్టల్స్ ఉన్న ఫొటోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఆ తుపాకులు నిత్యం తన మంచం పక్కనే ఉంటాయని అప్పట్లో ఆయన తెలిపారు.అంతకుముందు, మే 2022లో టెక్సాస్ (Texas) రాష్ట్రంలోని ఓ ఎలిమెంటరీ స్కూల్లో జరిగిన కాల్పుల ఘటనపై కూడా మస్క్ స్పందించారు. అసాల్ట్ రైఫిల్ వినియోగంపై ఆంక్షలు విధించాలని అభిప్రాయపడ్డారు.‘ఈ రైఫిల్ కొనుగోలుకు ప్రత్యేక పర్మిట్ (Permit) విధానం అమలు చేయాలి. కొనుగోలుదారుడి గతం గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాకే ఈ పర్మిట్ జారీ చేయాలి’ అని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, ఆ కాల్పుల ఘటనలో ఏకంగా 19 మంది చిన్నారులు సహా మొత్తం 21 మంది ప్రాణాలు కోల్పోయారు. అసాల్ట్ రైఫిల్‌తో స్కూల్లోకి వచ్చిన దుండగుడు చిన్నారులపై విచక్షణా రహితంగా కాల్పులు (Firing) జరపడంతో వారంతా అక్కడికక్కడే మరణించారు.