తెలంగాణ (Telangana) ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలెర్ట్ ప్రకటించింది. రాగల ఐదురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వెదర్ డిపార్ట్మెంట్ (Weather Department) తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని సూచించింది.. ఇప్పటికే గత రెండు, మూడు రోజులు భారీ వర్షాలు (Heavy rains) కురిస్తున్నాయి.. ఇప్పుడు మరో ఐదు రోజులు అంటే జనాలు హడలెత్తిపోతున్నారు. అక్టోబర్ 3 వరకు తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు (Thunder),మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఇక హైదరాబాద్(Hyderabad)లోనూ ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.. ఉదయం వేళల్లో పొగమంచు వాతావరణం నెలకొనే అవకాశం ఉందని తెలిపింది.. తెలంగాణలో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతమే నమోదు అయ్యింది.శుక్రవారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసాయి. సిద్దిపేట (Siddipet) జిల్లా మర్కూక్ మండలంలో అత్యధికంగా 9.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జగిత్యాల జిల్లా ధర్మపురిలో 8.2 సెంటీమీటర్ల వర్షం పడింది. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో 8, మెదక్ జిల్లా కౌడిపల్లిలో 7.4, మంచిర్యాల జిల్లా దండేపల్లిలో 6.7, కరీంనగర్ జిల్లా గంగాధరలో 6.4, పెద్దపల్లి జిల్లా రామగుండం(Ramagundam)లో 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ నగరవ్యాప్తంగా, పరిసర జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు పడ్డాయి.