AP: 2014 నుంచి 2024 వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్న విషయాన్ని తెలుపుతూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ‘అమరావతి రాజధానిగా గుర్తిస్తూ చట్టబద్ధతకు సంబంధించి కేంద్రం కసరత్తు చేస్తోంది. అవకాశం ఉంటే ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టే అవకాశం ఉంది. కేంద్రమంత్రి వర్గంలో చర్చించిన తర్వాత పూర్తిస్థాయిలో స్పష్టత వస్తుంది’ అని లేఖలో పేర్కొంది.