AKP: జిల్లాలో ఈ ఏడాది పదవ తరగతి పరీక్షల రాసే విద్యార్థుల కోసం 107 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి శ్రీధర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం కోటవురట్ల ప్రభుత్వ హైస్కూల్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు.