ప్రకాశం: బేస్తవారిపేట మండలంలోని ఒందుట్ల గ్రామంలో జల సురక్ష మాసం కార్యక్రమాన్ని ఎంపీడీవో రంగనాయకులు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బోర్ వెల్స్, హ్యాండ్ పంప్స్ వద్ద ఉన్న పిచ్చి మొక్కలు, చెత్తను తొలగించి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేటట్లు చర్యలు తీసుకున్నారు. అనంతరం ట్యాంకుల వద్ద ఉన్న పాచి, ముళ్ళ కంపను, చెత్తను తొలగించి క్లోరినేషన్ చేయించారు.