SKLM: ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా ప్రతీ ఒక్కరూ స్వదేశీ వస్తువులనే ప్రోత్సహించాలని సంతబొమ్మాళి మండలం బీజేపీ అధ్యక్షులు డి.కామయ్య అన్నారు. శుక్రవారం సంతబొమ్మాళి M మలగం పంచాయతీలో పలు దుకాణాలు, వ్యాపార సముదాయాలలో స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని వ్యాపారస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి దేపల్లి పాపారావు ఉన్నారు.