»13 People Died In The Madagascar Stadium Stampede Prime Minister Mourns
Madagascar stadium: తొక్కిసలాటలో 13 మంది మృతి..ప్రధాని సంతాపం
మడగాస్కర్ రాజధాని అంటనానారివోలోని స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు పిల్లలతో సహా దాదాపు 13 మంది మరణించారు. హిందూ మహాసముద్ర ద్వీపం క్రీడల ప్రారంభోత్సవం సందర్భంగా హాజరయ్యేందుకు ఒక్కసారిగా అభిమానులు వచ్చిన నేపథ్యంలో ఇది జరిగినట్లు తెలుస్తోంది.
13 people died in the madagascar stadium stampede Prime Minister mourns
మడగాస్కర్ రాజధాని అంటానానరివోలోని స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 13 మంది మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై అక్కడి అధ్యక్షులు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన దురదృష్టకరమని అభివర్ణిస్తూ.. ప్రవేశద్వారం వద్దకు ఒకే సారి ఎక్కువ మంది రావడంతో తొక్కిసలాట జరిగిందని అన్నారు. చాలా మందికి గాయాలయ్యాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్టేడియంలో ఉన్న ప్రజలతో పాటు అధ్యక్షులు కూడా వారి మృతి పట్ల మౌనం పాటించారు.
మడగాస్కర్‌లోని బరియా స్టేడియంలో శుక్రవారం హిందూ మహాసముద్ర ద్వీప క్రీడల ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి దాదాపు 50 వేల మంది ప్రేక్షకులు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్టేడియం ప్రవేశద్వారం దగ్గర ఆకస్మాత్తుగా తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో 13 మంది చనిపోయారు. విషయం తెలుసుకున్న అధికారులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
అయితే స్టేడియంలో తొక్కిసలాటకు అసలు కారణం ఏంటి అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. లేజర్ షో, బాణసంచా కాల్చడంతో వేడుక కొనసాగింది. ఇండియన్ ఓషన్ ఐలాండ్ గేమ్స్ సెప్టెంబర్ 3 వరకు మడగాస్కర్‌లో జరగనున్నాయి.ఈ ఈవెంట్లో మారిషస్, సీషెల్స్, కొమొరోస్, మడగాస్కర్, మయోట్, రీయూనియన్, మాల్దీవులకు చెందిన అనేక మంది క్రీడాకారులు పాల్గొన్నారు.