»Pakistan 11 People Killed While Collecting Free Flour In Punjab Province
Pakistanలో ఘోరం.. పిండి కోసం తోపులాటలో 11 మంది మృతి
తోపులాట సంఘటనను మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ఖండించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా పాలక ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పొరుగున పాకిస్థాన్ (Pakistan)లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ (Economic System) అస్తవ్యస్తమైంది. ధరలు భారీగా పెరిగిపోయి ప్రజలు కొని తినలేని పరిస్థితి. అక్కడ తీవ్రంగా ఆహార కొరత (Food Crisis) ఏర్పడింది. ఆహారం కోసం ప్రజలు అల్లాడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఉచితంగా గోధుమ పిండి (Flour) పంపిణీ చేసే కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. తమకు పిండి లభిస్తుందో లేదో అనే ఆతృతలో తొక్కిసలాట (Stampede) చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఏకంగా 11 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద సంఘటనపై అక్కడి ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ (Punjab Province)లో ఉచితంగా గోధుమ పిండి పంపిణీ (Free Distribution) కేంద్రాలు ప్రారంభించారు. ఆ కేంద్రాల వద్ద పలుసార్లు తొక్కిసలాట చోటుచేసుకుని 11 మంది మృతి చెందారు. మంగళ, బుధవారాల్లో ఈ సంఘటనలు చోటుచేసుకున్నాయి. మృతుల్లో ఒక మహిళ కూడా ఉంది. దక్షిణ పంజాబ్ (South Punjab)లోని సాహివాల్ (Sahival), బహవల్ పూర్ (Bahawalpur), ముజఫర్ గఢ్, ఒకారా, ఫసైలాబాద్, జెహనియన్, ముల్తాన్ జిల్లాల్లోని గోధుమల పిండి కేంద్రాల వద్ద ఈ తొక్కిసలాట జరిగింది. నగదు కొరతతో (Currency Shortage) ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం పాకిస్థాన్ ప్రభుత్వం (Govt Of Pakistan) పంజాబ్ ప్రావిన్స్ లో పేదల కోసం ఉచితంగా గోధుమల పిండి పంపిణీని ప్రవేశపెట్టింది. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున కేంద్రాలకు తరలివచ్చి పిండిని తీసుకెళ్తున్నారు.
అయితే డిమాండ్ కు తగ్గట్టు పిండి సరఫరా చేయకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తమకు దొరుకుతుందో లేదోనని ఎగబడుతున్నారు. పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మోహిసిన్ నఖ్వీ (Mohsin Naqvi) మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గోధుమ పిండి సరఫరాపై తన కార్యాలయంలో బుధవారం సమీక్షించారు. కొరత లేకుండా ప్రజలకు పిండి అందించాలని అధికారులకు ఆదేశించారు. మూడు రోజుల్లో దగ్గరుండి గోధుమ పిండి ప్రశాంత వాతావరణంలో సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజాప్రతినిధులకు సీఎం నఖ్వీ సూచించారు. కాగా తోపులాట సంఘటనను మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ఖండించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా పాలక ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
This video from #TerroristNationPakistan is for all the people who actually “believe” in the ‘indexes”, according to whom Pakistan is better ranked than Bharat. Shame on presstitute media, who keeps propagating those rankings. People r dying just a bag of wheat flour. pic.twitter.com/YH29j3uCc0