»Sperm Donor Jonathan Who Fathered Of 550 Children Case Filed Netherlands
Jonathan 550 మందికి తండ్రి.. ఆయన్ను అడ్డుక్కోవాలని కోర్టుకెక్కిన మహిళ
అతడి వీర్యదానాన్ని అడ్డుకోవాలంటూ ఓ మహిళ కోర్టులో (Court) పిటిషన్ వేసింది. దేశ నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నాడని జొనథన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అయితే ఆ సదరు మహిళ కూడా జొనథన్ వీర్యదానం ద్వారా ఓ బిడ్డకు జన్మనిచ్చింది కావడం విశేషం.
ఆయన వైద్యుడు (Doctor). సంతానం లేని వారికి పిల్లలు పుట్టేలా చేస్తుంటాడు. అలా ఏకంగా 550 మందికి సంతాన భాగ్యం కలిగించాడు. అయితే ఆ వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా వీర్యదానం (Sperm Donation) చేస్తున్నాడని తెలిసి ఓ మహిళ అభ్యంతరం వ్యక్తం చేసింది. అతడిని అడ్డుకోవాలని కోరుతూ ఏకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ సంఘటన నెదర్లాండ్స్ (Netherlands) దేశంలో జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
నెదర్లాండ్స్ లోని ది హేగ్ (The Hague) అనే పట్టణంలో జొనథన్ ఎం (41) (Jonathan Jacob Meijer) అనే వైద్యుడు ఉంటున్నాడు. సంతానోత్పత్తి (Fertility Center) కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. ఈయన పిల్లలు లేని వారికి సంతానం కలిగేలా చేస్తున్నాడు. దీంతో అతడు ఆ ప్రాంతంలో ప్రసిద్ధి పొందాడు. అయితే నెదర్లాండ్స్ లో ఒక వ్యక్తి 12 కుటుంబాలకు మాత్రమే వీర్యదానం చేయాలి. కానీ జొనథన్ ఇప్పటివరకు నెదర్లాండ్స్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా 13 క్లినిక్ (Clinics)లో వీర్యదానం చేశాడు. ఆయన వీర్యదానంతో ఏకంగా 550 మంది పిల్లల పుట్టుకకు కారణమయ్యాడు.
2017లోనే వీర్యదానంతో వంద మంది పిల్లల జన్మకు జొనథన్ కారకుడు అయ్యాడు. కేవలం 12 కుటుంబాలకు వీర్యదానం చేయాల్సి ఉందనే దేశ నిబంధనలను (Rules) జొనథాన్ ఉల్లంఘించాడు. నెదర్లాండ్స్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ది డచ్ సొసైటీ ఆఫ్ అబ్సెట్రిక్ అండ్ గైనకాలజీ (ఎన్వీఓజీ) (Dutch Society of Obstetrics and Gynecology- NVOG) జొనథన్ ను నిషేధిత జాబితాలో ఉంచింది. ప్రస్తుతం అతడు కెన్యా (Kenya)లో నివసిస్తున్నాడు. అయితే అతడి వీర్యదానాన్ని అడ్డుకోవాలంటూ ఓ మహిళ కోర్టులో (Court) పిటిషన్ వేసింది. దేశ నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నాడని జొనథన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అయితే ఆ సదరు మహిళ కూడా జొనథన్ వీర్యదానం ద్వారా ఓ బిడ్డకు జన్మనిచ్చింది కావడం విశేషం.