»England Who Finally Won Netherlands Suffered A Heavy Defeat
ENG vs NED: ఎట్టకేలకు విజయం సాధించిన ఇంగ్లండ్..నెదర్లాండ్స్ ఘోర ఓటమి
నేటి వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. ఈ మెగాటోర్నీలో ఈ జట్టు రెండో విజయాన్ని పొందింది. 160 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ పై అద్భుత విజయాన్ని ఇంగ్లండ్ జట్టు నమోదు చేసింది.
నేడు జరిగిన వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ టీమ్‌పై ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. దీంతో ఆ జట్టుకు స్వల్ప ఊరట లభించినట్లయ్యింది. ఈ టోర్నీలో ఇంగ్లండ్ జట్టు రెండో విజయాన్ని సాధించింది. నెదర్లాండ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 160 పరుగుల తేడాతో ఇంగ్లండ్ జట్టు ఘన విజయాన్ని పొందింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ స్టోక్స్ 108, డేవిడ్ మలన్ 87, క్రిస్ వోక్స్ 51 పరుగులు చేశారు.
నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డి లీడే 3, ఆర్యన్ దత్ 2, లోగాన్ వాన్ బీక్ 2 వికెట్లను తీశారు. 340 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు 37.2 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌట్ అయ్యింది. నెదర్లాండ్స్ బ్యాటర్లలో తేజ నిడమనూరు 41, స్కాట్ ఎడ్వర్డ్స్ 38, వెస్లీ బరేసి 37 పరుగులు చేశారు. ఇకపోతే ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీ, ఆదిల్ రషీద్ చెరో మూడు వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. డేవిడ్ విల్లీ 2, క్రిస్ వోక్స్ ఓ వికెట్‌ను తీశారు. ఇంగ్లండ్ జట్టు నెదర్లాండ్స్ పై 160 పరుగుల తేడాతో విజయం సాధించింది.