Engineer in spin bowling.. Former England spinner praises Ashwin
Ashwin: భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) ఓ అద్భుతమైన బౌలర్ అంటూ ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్(Monty Panesar) ప్రశంసలు కురిపించాడు. స్పిన్ బౌలింగ్‌లో అశ్విన్ ఇంజనీర్ అని కొనియాడారు. అతను వేసే ప్రతీసారి బంతి యాంగిల్‌ను మార్చుతాడని, తద్వారా బ్యాట్స్ మెన్ కన్ఫ్యూజ్ అవుతాడని పేర్కొన్నారు. 2012లో అశ్విన్ ఆటను మొదటి సారి చూశానని, అప్పుడే అతను గొప్ప బౌలర్ అవుతాడని అభిప్రాయ పడినట్లు వెల్లడించారు. ఈమేరకు ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పనెసర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లాండ్ టీమ్‌లో లెగ్ స్పిన్నర్‌గా మంచి గుర్తింపు ఉంది. చాలా కాలం అద్భుతంగా రాణించారు. 2016 లో అన్ని క్రికెట్ ఫార్మాట్లకు ఆయన గుడ్ బై చెప్పారు. 100వ టెస్ట్ మ్యాచ్ ఆడనున్న అశ్విన్‌ను స్పిన్ బౌలింగ్‌లో ఇంజనీర్ అంటూ ప్రశంసించారు.
ధర్మశాల వేదికగా గురువారం ఇంగ్లాండ్‌తో ఐదో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ రవిచంద్రన్ అశ్విన్‌కు 100వ మ్యాచ్. ఇప్పటి వరకు 99 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 23.9 సగటున 507 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు. టెస్టు ఫార్మెట్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో చోటు దక్కించుకున్నాడు. భారత రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.