»Sunrisers Hyderabad Who Is The New Captain For Sunrisers
Sunrisers Hyderabad: సన్‌రైజర్స్‌కు కొత్త కెప్టెన్.. ఎవరంటే?
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ మారుతాడని కొన్ని రోజుల నుంచి చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది.
Sunrisers Hyderabad: సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ మారుతాడని కొన్ని రోజుల నుంచి చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే సన్‌రైజర్స్ కెప్టెన్ బాధ్యతలు కమిన్స్‌కు అప్పగిస్తున్నట్లు కీలక ప్రకటన చేసింది. మినీ వేలంలో భారీగా వెచ్చించి సొంతం చేసుకున్న ప్యాట్ కమిన్స్‌కు సన్‌రైజర్స్ కెప్టెన్‌గా నియమించింది. ఇటీవల జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో కమిన్స్‌ను సన్‌రైజర్స్ రూ.20.5 కోట్లకు దక్కించుకుంది.
మార్చి 23న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో హైదరాబాద్ ఫస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఈ సారి ఎలాగైనా మెరుగైన ప్రదర్శనతో రాణించాలనే లక్ష్యంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ కమిన్స్‌ను కెప్టెన్‌గా నియమించింది. సన్‌రైజర్స్ గత సీజన్లో కేవలం నాలుగు మ్యాచుల్లోనే గెలిచింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. అప్పటి కెప్టెన్ ఐదెన్ మార్క్రమ్ ప్రదర్శన కూడా గొప్పగా లేదు. దీంతో ఈసారి కెప్టెన్ బాధ్యతలు మార్క్రమ్ బదులు ప్యాట్ కమిన్స్‌కు బాధ్యతలు అప్పగించింది.