PM Modi : దేశంలోనే మొదటి అండర్ వాటర్ మెట్రో టన్నెల్‌ను ప్రారంభించిన మోదీ
దేశంలోని మొదటి అండర్ వాటర్ మెట్రో రైలు పయనించే టన్నెల్‌ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. తర్వాత మెట్రో రైలు ఎక్కి పాఠశాల విద్యార్థులతో కలిసి ప్రయాణించారు.
PM Modi Underwater Metro : నీటి అడుగున నడిచే తొలి అండర్ వాటర్ మెట్రో రైలుకు సంబంధించిన టన్నెల్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. తర్వాత పాఠశాల విద్యార్థులతో కలిసి మెట్రోలో ప్రయాణించారు. అనంతరం విద్యార్థులతో పాటు మెట్రో సిబ్బందితో ఆత్మీయంగా సంభాషించారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న మోదీ ఈ మెట్రో టన్నెల్‌తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
ఈ మెట్రో రైలు టన్నెట్ దేశంలోనే మొదటగా నదీ గర్భం(Underwater) లో ఉన్న సొరంగం. వెస్ట్ మెట్రో కారిడార్ కింద హుగ్లీ నది అడుగున మొత్తం 16.6 కిలోమీటర్ల మేర రాళ్ల రాకపోకల కోసం టన్నెల్‌ని ఏర్పాటు చేశారు. ఇది హావ్‌డా మైదాన్ నుంచి ఎస్‌ప్లనాడె స్టేషన్ మధ్యలో ఉంది. దాదాపుగా 120 కోట్ల బడ్జెట్‌తో దీన్ని నిర్మిస్తున్నారు.
టన్నెల్ ప్రారంభంతో పాటుగా మరి కొన్ని అభివృద్ది కార్యక్రమాలనూ ఆయన ప్రారంభించారు. ఆగ్రా మెట్రో, మీరట్ మెట్రో, పూనే మెట్రో సహా దేశంలో పలు మెట్రో(Metro) సేవలను ప్రధాని నరేంద్ర మోదీ కోల్‌కతా నుంచి వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. తర్వాత కోల్‌కతాలో దాదాపుగా 15, 400 కోట్ల రూపాయల విలువైన బహుళ కనెక్టవిటీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.