»Vizag Steel Plant Employee Couple Commits To Suicide In Yeleru Canal
Vizag Steel Plant గాజువాకలో విషాదం: సెల్ఫీ వీడియో దంపతుల కథ విషాదాంతం
ధిక వడ్డీలకు అప్పులు చేయడంతో అప్పులు ఇచ్చిన వారు వేధిస్తున్నారని తెలుస్తున్నది. వారి వేధింపులు తాళలేకనే వీరు బలవన్మరణానికి పాల్పడ్డారని స్థానికులు చెబుతున్నారు. వారి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
మంచి ఉద్యోగం.. పిల్లలు జీవితంలో స్థిరపడ్డారు. కుటుంబబరంగా.. ఉద్యోగపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. అయినా ఆ దంపతులు (Wife and Husband) బలవన్మరణానికి పాల్పడ్డారు. ముందు రోజు సెల్ఫీ వీడియో (Selfie Video) తీసుకుని తాము ఆత్మహత్య చేసుకుంటున్నాం అని ప్రకటించిన గాజువాక (Gajuwaka) దంపతుల కథ విషాదాంతంగానే ముగిసింది. వారిని కాపాడేందుకు కుటుంబసభ్యులు, పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వారిని ప్రాణాలతో పట్టుకోలేకపోయారు. ఆ భార్యాభర్తలు ఏలేరు కాలువలో తేలారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీలోని విశాఖపట్టణం (Visakhapatnam)లో ఉన్న ఉక్కు కర్మాగారం (Vizag Steel Plant) ఎస్ఎంఎస్-2 విభాగంలో చిత్రాడ వరప్రసాద్ (47), మీరా (41) దంపతులు ఉద్యోగులు. వీరికి కుమారుడు కృష్ణ సాయితేజ, కుమార్తె దివ్యలక్ష్మి ఉంది. విశాఖలోని తిరుమలనగర్ సమీపంలోని శివాజీనగర్ లో నివసిస్తున్నారు. కుమార్తెకు గతేడాది వివాహం చేశారు. ఏం జరిగిందో ఏమిటో తెలియదు కానీ మార్చి 27న భార్యాభర్తలు వరప్రసాద్, మీరా ఓ సెల్ఫీ వీడియో కుటుంబసభ్యులకు పంపారు. ‘మేమిద్దరం వెళ్లిపోతున్నాం. మా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. వాళ్లను ఎవరూ ఏమీ అనవద్దు. ఒకవేళ ఎవరైనా ఏమైనా అంటే పిల్లలు పట్టించుకోకండి’ అంటూ ఆ వీడియోలో దంపతులు రోదించారు.
కుటుంబసభ్యులు, బంధువులకు పంపించడం కలకలం రేపింది. అనంతరం వాళ్లు ఫోన్ స్విచ్ఛాప్ (Switch off) చేసుకుని అదృశ్యమయ్యారు. వారి కోసం పిల్లలతో పాటు కుటుంబసభ్యులు, పోలీసులు విస్తృతంగా గాలించారు. మూడు రోజులైనా వారి ఆచూకీ లభించలేదు. కాగా అనకాపల్లి (Anakapalle) సమీపంలోని ఏలేరు కాలువ (Yeleru Canal) వద్ద రెండు మృతదేహాలు నీటిలో తేలాయి. గజ ఈతగాళ్ల సహాయంతో వాటిని వెలికితీయగా ఆ మృతదేహాలు వరప్రసాద్, మీరావి కావడంతో కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కాలువ గట్టున వారి చెప్పులు, హ్యాండ్ బ్యాగ్, ఇతర వస్తువులు కనిపించాయి.
కాగా, వారు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏమిటనేది తెలియడం లేదు. అధిక వడ్డీలకు అప్పులు చేయడంతో అప్పులు ఇచ్చిన వారు వేధిస్తున్నారని తెలుస్తున్నది. వారి వేధింపులు తాళలేకనే వీరు బలవన్మరణానికి పాల్పడ్డారని స్థానికులు చెబుతున్నారు. వారి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ దంపతుల పిల్లలు సాయికృష్ణ తేజ, దివ్యలక్ష్మిలతో వివరాలు సేకరిస్తున్నారు.