»Young Girl Committed To Suicide For Gold Ring Missed In Warangal District
Gold ఉంగరం పోయిందని ప్రాణం తీసుకున్న విద్యార్థిని
తలుపును తెరచి కుమార్తెను కిందకు దింపగా అప్పటికే హేమలతా మృతి చెందింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జగదీశ్ తెలిపారు. కాగా ఇంట్లో యువతి రాసిన లేఖ లభించింది.
తనకు ఇచ్చిన ఉంగరం (Gold Ring) పోగొట్టుకోవడంతో ఇంట్లో వాళ్లు తిడతారనే భయంతో ఓ విద్యార్థిని (Student) బలవన్మరణానికి పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్న ప్రాణం తీసుకుంది. ‘సారీ డాడీ.. నాకు భయమేస్తోంది’ అంటూ ఆమె తన చివరి లేఖలో రాసుకుని నిండు జీవితాన్ని బలి తీసుకుంది. ఈ సంఘటనతో ఆ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. ఈ సంఘటన తెలంగాణ (Telangana)లో చోటుచేసుకుంది.
వరంగల్ జిల్లా (Warangal District) దంతాలపల్లి (Danthalapally) మండలం గున్నేపల్లికి చెందిన భార్యాభర్తలు మద్దుల జానకి రాములు- రాణి. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద బిడ్డ హేమలతా రెడ్డి (19) (Hemalatha Reddy) హనుమకొండలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీకాం (B.com) రెండో సంవత్సరం చదువుతుండేది. చిన్న కుమార్తె అశ్విత (Ashwitha) మరిపెడలోని సాంఘిక సంక్షేమ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఉగాది పండుగ పురస్కరించుకుని ఈనెల 20వ తేదీన ఇంటికొచ్చారు. అయితే 19వ తేదీన బుధవారం తన చేతికి ఉన్న అర్ధ తులం బంగారు ఉంగరాన్ని పోగొట్టుకున్నది. ఇల్లంతా వెతికినా లభించలేదు. గతంలో ఆరు నెలల కిందట బంగారు గొలుసు కూడా పోగొట్టుకున్నారు.
తాజాగా ఉంగారం పోవడంతో తండ్రి మందలిస్తాడని హేమలత భయాందోళన (Fear) చెందింది. ఈ భయంతో ఆ యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. పొలం పనుల నుంచి జానకి రాములు ఇంటికి వచ్చి చూడగా గడియ వేసి ఉంది. లోపల కుమార్తె ఫ్యాన్ (Fan)కు వేలాడుతూ కనిపించింది. హతాశయుడైన ఆయన వెంటనే తలుపును తెరచి కుమార్తెను కిందకు దింపగా అప్పటికే హేమలతా మృతి చెందింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జగదీశ్ తెలిపారు. కాగా ఇంట్లో యువతి రాసిన లేఖ లభించింది.