»Vijayawada People Suffer Traffic Jam With Cm Jagan Tour
CM జగన్ పర్యటన అంటే పెద్ద తలనొప్పి.. 2 గంటలు నరకం
పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. సీఎం జగన్ (YS Jagan) పర్యటన అంటే చాలు నానా హైరానా చేస్తారు. తాజాగా వారి హడావుడినో లేదా సమన్వయ లోపమో తెలియదు కానీ విజయవాడవాసులు (Vijawada) మాత్రం రెండు గంటలు నరకం చూశారు.
పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. సీఎం జగన్ (YS Jagan) పర్యటన అంటే చాలు నానా హైరానా చేస్తారు. తాజాగా వారి హడావుడినో లేదా సమన్వయ లోపమో తెలియదు కానీ విజయవాడవాసులు (Vijawada) మాత్రం రెండు గంటలు నరకం చూశారు. సీఎం వస్తున్నాడని చెప్పి రెండు గంటలకు పైగా విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Diversions) విధించారు. వాహనాలను నిలిపి హడావుడి చేశారు. తీరా చూస్తే ముఖ్యమంత్రి రెండు గంటల తర్వాత వెళ్లారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
విశాఖపట్టణం (Visakhapatnam)లో జరిగిన జీ20 సదస్సు (G-20)కు సీఎం జగన్ మంగళవారం సాయంత్రం బయల్దేరాల్సి ఉంది. మధ్యాహ్నం 3.30 నుంచి పోలీసులు హల్ చల్ చేశారు. అప్పటి నుంచి ట్రాఫిక్ ను నిలువరిస్తున్నారు. నాలుగు గంటలకు సీఎం వస్తారని భావించి గుంటూరు వైపు నుంచి వచ్చే భారీ వాహనాలను దారి మళ్లించారు. దీంతో బెంజి సర్కిల్ (Benz Circle) మీదుగా బందరు రోడ్డుపై భారీ వాహనాలు భారీగా చేరడంతో ట్రాఫిక్ రద్దీ పెరిగింది. అయితే సీఎం జగన్ ఎంతకీ రాకపోవడంతో వాహనాలను వదిలారు. కానీ అప్పటికీ రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సాయంత్రం 4.30కు మరోసారి చెన్నై-కోల్ కతా జాతీయ రహదారి (Highway) పై వాహనాలను నిలిపివేశారు. అప్పుడు కూడా సీఎం జగన్ రాలేదు. దీంతో వాహనాలను వదిలేశారు. ఐదు గంటలకు కూడా మరోసారి ఇలానే చేశారు. కానీ ముఖ్యమంత్రి రాలేదు. ఈ పరిణామాలతో ఒక్కసారిగా బెంజి సర్కిల్, బందరు రోడ్డుపై వాహనాలు భారీగా చేరుకున్నాయి.
కానీ చివరకు 5.35కు సీఎం తాడేపల్లి (Tadepalli) నుంచి బయల్దేరారు. 6.03 నిమిషాలకు విమానాశ్రయం (Airport) చేరుకున్నారు. కాగా సీఎం ప్రయాణించాల్సిన విమానం మొరాయించింది. ఇంజన్ లో లోపంతో సీఎం 11 నిమిషాల పాటు కారులోనే వేచి ఉన్నారు. లోపం సరిదిద్దిన అనంతరం 6.24 గంటలకు సీఎం జగన్ విశాఖపట్టణం బయల్దేరారు. ఇలా సీఎం జగన్ పర్యటనతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కార్యాలయాలు, విద్యాలయాలు ముగిసి ఇళ్లకు వెళ్లే సమయంలో పలుమార్లు ట్రాఫిక్ ను నియంత్రించి వదిలేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రజలు ఇళ్లకు వెళ్లేసరికి రాత్రి 8, 9 అయ్యిందని పలువురు చెప్పారు.