బాచుపల్లిలోని నారాయణ కళాశాలలో విషాదం చోటుచేసుకుంది. మహిళా క్యాంపస్ హాస్టల్లో ఉంటున్న విద్యార్థిని వంశిక హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. వంశిక ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కామారెడ్డి జిల్లాకు చెందిన వంశిక ఇటీవల వారం రోజుల క్రితమే క్యాంపస్‌కి వచ్చినట్లు తెలిసింది. అయితే వంశిక బలవన్మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.