A series of atrocities in the adult industry.. Another actress Sophia Leone committed suicide
Sophia Leone: అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో నటి ఆత్మహత్యకు పాల్పడ్డారు. నీలి చిత్రాల నటి సోఫియా లియోన్ అమెరికాలోని తన అపార్ట్మెంట్లో విగతజీవిగా కనిపించారు. 26 సంవత్సరాల ఈ నటీ చనిపోయిన వార్త ఆలస్యంగా వెలుగోలికి వచ్చింది. ఈ విషయాన్ని తన సవతి తండ్రి మైక్ రొమెరో వెల్లడించారు. క్రౌడ్ ఫండింగ్ సైట్ ‘గోఫండ్మీ’లో ఆయనీ విషయాన్ని వెల్లడిస్తూ సోఫియా కర్మకు నిధులు ఇవ్వాలని కోరారు. ఆమె తల్లి, కుటుంబ సభ్యుల తరపున భారమైన హృదయంతో ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్టు తెలిపారు.
సోఫియా ఆకస్మిక మరణం కుటుంబ సభ్యులు, స్నేహితులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, వారి కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. నటి మరణానికి గల కారణాలపై పోలీసు దర్యాప్తు కొనసాగిస్తున్న చెప్పారు. సోఫియా మరణవార్తలను ఆమె మోడలింగ్ ఏజెన్సీ ‘101 మోడలింగ్’ ధ్రువీకరించింది. సోఫియా లియోన్ అకాల మరణం విషాదం నింపిందని, వార్త విని తమ హృదయాలు బద్దలయ్యాయని పేర్కొంది. ఆమె ఆత్మహత్య చేసుకోలేదని, గృహ నిర్బంధ నరహత్య అని అభివర్ణించింది. దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది. 18 ఏళ్ల వయసులోనే సోఫియా అడల్ట్ ఇండస్ట్రీలో ప్రవేశించింది. అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇది నాలుగో ఆత్మహత్య. ఇంతకుముందు కాగ్నీ లిన్ కార్టర్, జెస్సీ జేన్, థైనా ఫీల్డ్స్ మృతి చెందారు.