హైదరాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. అభం, శుభం తెలియని ఓ మైనర్ బాలిక పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కారులో బాలికను అపహరించిన దుండగులు ఓ లాడ్జీ తీసుకుని రెండు రోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అదే లాడ్జీలో వదిలి వెళ్లారు. బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా వారి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు.
మత్తు మందు ఇచ్చి నిందితులు సామూహిత అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. హైదరాబాద్లో ఇటీవల సామూహిక అత్యాచార ఘటనలకు సంబంధించిన కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఇటీవల జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
పబ్లో పార్టీ నిర్వహించి ఓ బాలికను క్యాబ్లో తీసుకెళ్లి నిర్జన ప్రదేశంలో సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. మే 28న ఘటన జరిగినా మే 31 వరకు బాలిక తల్లిదండ్రులకు చెప్పలేదు. బాలికపై గాయాలు గుర్తించి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. మే 31న రాత్రి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ ఘటనలో సాదుద్దీన్ మాలిక్, మరో నలుగురు మైనర్లను పట్టుకున్నారు.