ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ పుష్ప2 లో భయంకరమైన విలన్ నటిస్తున్నాడా? అంటే, అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా విలన్?
Pushpa 2: పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా పుష్ప 2 తెరకెక్కుతుంది. ఈ మూవీ కోసం తెలుగు ప్రేక్షకులతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. డైరెక్టర్ సుకుమార్ నెక్స్ట్ లెవల్ అనేలా పుష్ప2 తెరకెక్కిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాలో పాన్ ఇండియా యాక్టర్స్ నటిస్తున్నారు. హీరోయిన్గా రష్మిక మందన్న నటిస్తుండగా.. విలన్‌గా ఫహద్ ఫాజిల్ నటిస్తున్నాడు. అలాగే దిశా పటానీ లాంటి స్టార్ హీరోయిన్‌తో ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు.. బాలీవుడ్ స్టార్స్‌ను కూడా రంగంలోకి దింపుతున్నాడు సుక్కు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ సినిమాలో సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. కేజీఎఫ్ చాప్టర్ 2లో విలన్‌గా నటించాడు సంజయ్ దత్. అధీరా పాత్రలో చాలా భయంకరంగా కనిపించాడు. దీంతో.. ప్రస్తుతం తెలుగులో కొన్ని సినిమాల్లో నటిస్తున్నాడు. రామ్, పూరి కాంబినేషన్లో వస్తున్న డబుల్ ఇస్మార్ట్‌లో కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇక ఇప్పుడు పుష్పరాజ్‌తో సై అంటున్నాడని అంటున్నారు. ఒకవేళ మున్నాభాయ్ ఈ సీక్వెల్లో నటిస్తే.. సినిమా పై మరింత వెయిట్ పెరిగినట్టే. ప్రజెంట్ జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప 2 సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి.. ఆగష్టు 15న పుష్ప2 రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. మరి ఈసారి పుష్పరాజ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.