»Vishwak Sen Said On The First Day Gami Into Profits
Gami Collections: మొదటి రోజే చెప్పేశారు.. లాభాల్లోకి ‘గామి’?
ఒక్క సినిమాను ఐదేళ్లు చెక్కారంటేనే అర్థం చేసుకోవచ్చు.. ఆ సినిమా అవుట్ పుట్ ఎలా ఉంటుందో? పేపర్ పై రాసుకున్న కథను.. కెమెరాలో బంధించాలంటే పెద్ద సాహసమే చేయాలి. అదే చేసి చూపించారు గామి చిత్ర యూనిట్.
Vishwak Sen said on the first day.. 'Gami' into profits.
Gami Collections: విశ్వక్ సేన్ ఏదైతే నమ్మాడో.. దాన్ని స్క్రీన్ పై వావ్ అనేలా ప్రజెంట్ చేశాడు దర్శకుడు విద్యాధర్ కాగిత. శంకర్ అనే అఘోరా.. మానవ స్పర్శ తాకితే ఎందుకు తట్టుకోలేడు? అసలు అది రోగమా? లేక ఏదైనా మెడికల్ ఎక్స్పెరిమెంటలా? అనే క్యూరియాసిటీతో మొదలైన గామి.. హిమాలయ జర్నీతో ఇంట్రెస్టింగ్గా సాగింది. విజువల్ వండర్‌గా వచ్చిన ఈ సినిమాకు అద్భుతమైన బీజిఎం, సినిమాటోగ్రఫీ ప్రాణం పోశాయి. అయితే.. ఈ సినిమాకు తెలుగు ఆడియెన్స్ ఎంతవరకు కనెక్ట్ అవుతారనేది చెప్పడం కష్టమే. కానీ ఫస్టె డే మాత్రం మంచి వసూళ్లను రాబట్టింది గామి. మహాశివరాత్రి సందర్భంగా.. మార్చి 8వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయిన గామి.. మొదటి ఆట నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
దీంతో డే వన్ అదరగొట్టేశాడు విశ్వక్ సేన్. గామి సినిమా మొదటి రోజు 9.07 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్టుగా ప్రకటించారు మేకర్స్. అమెరికాలో 250K డాలర్స్ పైగా కలెక్ట్ చేసి హాఫ్ మిలియన్ డాలర్స్ వైపు దూసుకుపోతుంది. ఇక వీకెండ్ కావడంతో ఈజీగా మూడు రోజుల్లో మంచి కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఓవరాల్‌గా గామి సినిమాకు 11 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే.. డే వన్ ఓపెనింగ్స్‌ను బట్టటి.. మూడు రోజుల్లోనే ఈ సినిమా లాభాల బాట పట్టే ఛాన్స్ ఉంది. ఫస్ట్ వీకెండ్లో 25 నుంచి 30 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి.. మూడు రోజుల్లోనే గామి బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయి లాభాల బాట పట్టనుంది. మొత్తంగా.. గామితో మరో హిట్‌ను తాన ఖాతాలో వేసుకున్నాడు విశ్వక్ సేన్. మరి లాంగ్ రన్లో గామి ఎంత రాబడుతుందో చూడాలి.