»One Crore Worth Sarees Seized At Bachupally Hyderabad
Sarees seized: కోటి విలువైన పట్టు చీరలు పట్టివేత..ఓటర్లకోసమేగా?
తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే పలువురు అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ పరిధిలో ఓ లారీ నిండా చీరలు తీసుకెళ్తుండగా పట్టుబడ్డాయి.
one crore worth sarees seized at bachupally hyderabad
తెలంగాణ(telangana)లో ఎన్నికల షెడ్యూల్ వచ్చిందో లేదో ఓటర్లకు గాలం వేసేందుకు ప్రధాన పార్టీల నేతలు పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. పలువురు డ్రైస్సులను పంచే ప్రయత్నం చేస్తుండగా..మరికొంత మంది అయితే ఏకంగా మహిళలకు వెండి పట్టిలు, ఇంకొంత మందికి కలిపి బంగారు అభరణాలు సైతం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటివల తనిఖీల్లో భాగంగా మియాపూర్లో వెండి, గోల్డ్ అభరణాలు భారీగా పట్టుబడటంతో అవి ఓటర్ల కోసమేనని పలువురు అంటున్నారు.
తాజాగా హైదరాబాద్ పరిధిలోని బాచుపల్లి(bachupally)లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో పెద్ద ఎత్తున చీరలు పట్టుబడ్డాయి. అయితే వాటి విలువ దాదాపు కోటి రూపాయలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఒక లారీలో మొత్తం చీరలే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చీరల వివరాల గురించి ఆధారాలు లేకపోవడంతో వాటిని అధికారులు సీజ్ చేశారు. అయితే వాటిని వచ్చే ఎన్నికల ఓటర్లకు పంచేందుకే తీసుకెళ్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్లోని మరికొన్ని చోట్ల జరిపిన తనిఖీల్లో పెద్ద ఎత్తున మిక్సీలు, రైస్ కుక్కర్లు కూడా లభ్యమయ్యాయి.