Chikkadpally Police File A Case Against BJP MP Laxman And Feroz Khan
BJP MP Laxman And Feroz Khan: బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (BJP MP Laxman), కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ తదితరులపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ప్రవళిక అనే విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయడం వల్లే ఆమె సూసైడ్ చేసుకుందని.. హాస్టల్ వద్ద ధర్నా చేపట్టారు. తర్వాత విచారణ చేపట్టగా.. ఆమెకు లవర్ ఉన్నాడని.. అతని వేధింపులు భరించలేక చనిపోయిందని తేలింది.
ఇదే విషయాన్ని ప్రవళిక తల్లి విజయం, ఆమె సోదరుడు ప్రణయ్ కూడా స్పష్టంచేశారు. దీంతో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. తమపై రాళ్లు రువ్వారని ఎంపీ లక్ష్మణ్, నాంపల్లికి చెందిన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్, ఓయూ జేఏసీ చైర్మన్ సురేశ్ యాదవ్‌పై కేసు పెట్టారు. అశోక్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్, ఆరుగురు విద్యార్థులపై కూడా కేసు ఫైల్ చేశారు. ఇటు ప్రవళిక కేసులో పరారీలో ఉన్న శివరామ్‌ను పట్టుకునేందుకు మూడు పోలీసులు బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. శివరామ్‌ను కఠినంగా శిక్షించాలని ప్రవళిక పేరంట్స్ కోరుతున్నారు.