Yemen school:యెమెన్‌లో స్కూల్ (Yemen school) వద్ద తొక్కిసలాట (stampede) జరిగింది. పవిత్ర రంజాన్‌ను (eid) పురస్కరించుకొని బాబల్ యెమెన్ జిల్లాలో ఓ సంస్థ చారిటీ (దుస్తులు, ఆహారం) పంపిణీ కార్యక్రమం చేపట్టింది. పేద దేశం అయిన యెమెన్‌లో (yemen) తినడానికి కూడా ఇబ్బంది పడేవారు చాలా మంది ఉన్నారు. రంజాన్ కోసం అందజేస్తోన్న కిట్ తీసుకునేందుకు జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. ఆ సందర్భంలో జరిగిన తొక్కిసలాటలో (stampede) 85 మంది మృతిచెందారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. మరో 322 మంది (322 wound) వరకు గాయపడ్డారని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది.
తొక్కిసలాటకు సంబంధించి వీడియోలు (video) సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. ఆ వీడియోలు హృదయ విదారకరంగా ఉన్నాయి. అయినప్పటికీ కొందరు కిందపడిన తొట్టుకుంటూ నడిచే వీడియోలను స్థానిక మీడియా ప్రసారం చేసింది.
స్కూల్ వద్ద హౌతీలు జనాలను నియంత్రించేందుకు గాలిలోకి కాల్పులు (fire) జరిపారు. ఆ బుల్లెట్ విద్యుత్ తీగను (electri wire) తాకి.. పేలిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురై.. పరుగులు తీశారని వివరించారు. దాంతో తొక్కిసలాట (stampede) జరిగిందని పేర్కొన్నారు.
రంజాన్‌కు ఒకరోజు ముందు విషాద ఘటన జరిగింది. జనం మృతితో ఆ కుటుంబాల్లో విషాదం నింపింది. స్కూల్ (school) వద్ద అక్కడికి వచ్చిన ప్రజల పాదరక్షలు (shoe), వాటర్ బాటిల్స్ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
— Sami AL-ANSI سـامي العنسي (@SamiALANSI) April 20, 2023
ఘటనకు సంబంధించి యెమెన్ ప్రభుత్వం స్పందించింది. స్కూల్లో వస్తువుల పంపిణీ నిర్వహించిన ఇద్దరు నిర్వాహకులను (two people) అదుపులోకి తీసుకున్నామని వివరించింది. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకోకపోవంతో తొక్కిసలాట జరిగిందని హౌతీ నేతృత్వంలోని అంతర్గత మంత్రిత్వశాఖ తెలిపింది.