»Pm Narendra Modi Conferred With Grand Cross Of Order Of Honour By Greek President Katerina N Sakellaropoulou
Narendra Modi: ప్రధాని మోడీకి మరో అరుదైన గౌరవం
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రధానిని గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ హానర్‌తో గ్రీస్ ప్రెసిడెంట్ సత్కరించారు. ఆ దేశ పర్యటనలో భాగంగా ఇరుదేశాల ప్రధానులు వాణిజ్యవ్యాపారాలపై సుదీర్ఘ చర్చలు జరిగిన నేపథ్యంలో మోడీ అందుకున్నారు.
Pm Narendra Modi conferred with Grand cross of order of honour by Greek president katerina N Sakellaropoulou
Narendra Modi: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) కి అరుదైన గౌరవం దక్కింది. గ్రీస్ పర్యటనలో భాగంగా ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. గ్రీస్ అధ్యక్షురాలు(Greece President) కాటెరినా సకెల్లారోపౌలౌ (Katerina N. Sakellaropoulou) ప్రధానికి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ హానర్(Grand Cross of the Order of Honour ) పురస్కారంతో గౌరవించారు. అలాగే చంద్రయాన్-3 విజయంపై భారతదేశాన్ని సకెల్లారోపౌలౌ అంటూ కొనియాడారు. దక్షిణాఫ్రికా పర్యటన ముగించుకుని గ్రీస్‌కు చేరుకున్న ప్రధాని మోడీకి ఘనస్వాగతం లభించింది. గత 40 ఏళ్లలో ఆ దేశాన్ని పర్యటించిన మొదటి ప్రధానిగా మోడీ నిలిచారు. ప్రధానిని చూసేందుకు భారతీయులు భారీ సంఖ్యలో ఎయిర్‌పోర్టుకు వచ్చారు. వారితో మోడీ ఆత్మీయంగా కరచాలనం చేస్తూ పలకరించారు.
అనంతరం నరేంద్రమోడీ గ్రీస్ ప్రధానితో పాటు అధ్యక్షురాలు సకెల్లారోపౌలౌ(Greek President Katerina N. Sakellaropoulou )తో భేటీ అయ్యారు. ఇరు దేశాల ప్రధాన వ్యాపారాలపై ఇరువురు నేతలు చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే ప్రధాన అజెండాగా ఈ పర్యటన సాగింది. 1983లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చివరిసారిగా గ్రీస్ లో పర్యటించారు. వాణిజ్యం, పెట్టుబడులు, షిప్పింగ్ వంటి విభిన్న అంశాలకు సంబంధించిన ఒప్పందాలపై చర్చలు జరిగాయి. విమానాశ్రయాలు, ఓడరేవులను ప్రైవేటీకరించడంలో భారతదేశ సహాయాన్ని పొందాలని గ్రీస్ భావిస్తోంది. దీంతో ఐరోపాలోకి ఇండియా అడుగుపెట్టేందుకు గ్రీస్ ఎంట్రీ పాయింట్‌గా ఉపయోగపడనుంది.
గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ హానర్ అవార్డును నీతిమంతులు మాత్రమే గౌరవించబడాలనే ఎథీనా అనే దేవత సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకుని 1975లో గ్రీస్ ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ఇస్తుంది. గ్రీస్ అభివృద్ధికి, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృషి చేసిన గ్రీస్ ప్రధానులకు, విదేశాల ప్రముఖులకు ఈ పురస్కారం ప్రధానం చేస్తారు. గ్రీస్-భారత్ స్నేహ బంధం బలోపేతానికి కృషి చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆ దేశం ఈ పురస్కారం ప్రదానం చేసినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది.
I thank President Katerina Sakellaropoulou, the Government and people of Greece for conferring upon me The Grand Cross of the Order of Honour. This shows the respect the people of Greece have towards India. @PresidencyGRpic.twitter.com/UWBua3qbPf