ఈ కాలం వారికి నేహా శెట్టి గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. డీజే టిల్లు మూవీతో ఒక్కసారిగా సెన్సేషన్ అయిపోయింది. ఆ మూవీ తర్వాత నేహాని ఎక్కువ మంది రాధిక గా పిలుస్తుంటారు. ఈ మూవీ ఎఫెక్ట్ నేహాకి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. శ్రీలీల తర్వాత టాలీవుడ్ లో బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరు అంటే నేహా పేరు చెప్పొచ్చు.
నేహా శెట్టి రీసెంట్ గా బెదురులంకతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంటనే రూల్స్ రంజన్ తో మరోసారి ప్రేక్షకులకు ముందుకు రావడానికి రెడీ అయ్యింది.
దీని తర్వాత వెంటనే, ఆమె గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో రానుంది. అంతేకాదు, సోషల్ మీడియాలోనూ చాలా చురుకుగా ఉంటుంది. తాజాగా చీరలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అవి నెట్టింట వైరల్ గా మారాయి.
ఆ ఫోటోల్లో నేహా శెట్టి చీర కట్టుకొని కనిపించారు. పసుపు రంగు చీరకు బ్లాక్ కలర్ బ్లౌజ్ తో మ్యాచ్ చేసింది.
మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా ధరించింది. ముక్కుకు ముక్కెరపెట్టుకొని, ముఖాన బొట్టు పెట్టుకొని చాలా అందంగా ఉంది. ట్రెడిషన్ లుక్ లో అందరినీ మెస్మరైజ్ చేస్తోంది.
ఇక, తన కెరీర్ గురించి తాజాగా ఆమె ఇటీవల కొన్ని విషయాలను వెల్లడించారు. ‘నేను ఏదో అవ్వాలనుకొని యాక్టర్ అయిపోలేదు. చిన్నప్పటి నుంచి నటి కావాలని బలంగా కోరుకునేదాన్ని.
అందుకు తగ్గట్టుగా నా కెరీర్ ప్లాన్ చేసుకున్నా. అమెరికాలోని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నాలుగు నెలలు యాక్టింగ్‌లో శిక్షణ కూడా తీసుకున్నా. ఇండియాకు వచ్చాక కన్నడలో మొదటి అవకాశం వచ్చింది.’ అని చెప్పింది.
మెహబూబా’ తెలుగులో నా మొదటి సినిమా. 2018లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మీకు పరిచయమయ్యా. ఆ సినిమా ఫలితం గురించి పక్కనపెడితే తెలుగువారి ఆదరణ నాకు కొండంత బలాన్నిచ్చింది.
అవకాశాల కోసం ప్రయత్నాల్లో ఉన్న తరుణంలోనే కరోనా వచ్చిపడింది. లాక్డౌన్ కారణంగా ఆదిలోనే నా కెరీర్‌కు కామా పడ్డట్టయింది. కొవిడ్ తగ్గుముఖం పట్టాక ‘డీజే టిల్లు’తో సూపర్‌హిట్ చిత్రం నా ఖాతాలో పడింది.’ అని చెప్పింది.