Ram Charan - Prabhas : ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే... పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మధ్య పాన్ ఇండియా వార్ జరగబోతున్నట్టే కనిపిస్తోంది.
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే… పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మధ్య పాన్ ఇండియా వార్ జరగబోతున్నట్టే కనిపిస్తోంది. తాజాగా ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ‘ప్రాజెక్ట్ కె’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్టు.. సాలిడ్ పోస్టర్‌తో అనౌన్స్ చేశారు. దీంతో వచ్చే సంక్రాంతి బరిలో ప్రభాస్ ఫిక్స్ అయిపోయాడు. అయితే సంక్రాంతికి ఇంకొన్ని పాన్ ఇండియా సినిమాలు కూడా రంగంలోకి దిగబోతున్నట్టు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. పుష్ప2, ఆర్సీ 15, ఉస్తాద్ భగత్ సింగ్.. వంటి సినిమాలు రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. కానీ అందరికంటే ముందే ప్రభాస్ రంగంలోకి దిగిపోయాడు. దాంతో ప్రభాస్‌తో ఎవరు పోటీపబడబోతున్నారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. పుష్ప2ని డిసెంబర్లో రిలీజ్ చేసుకున్నా.. ఉస్తాద్ భగత్ సింగ్ అప్పటి వరకు రెడీ అవుతుందని ఖచ్చితంగా చెప్పలేం. కానీ దిల్ రాజు నిర్మిస్తున్న ఆర్సీ 15ను మాత్రం సంక్రాంతికే తీసురావాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలా లేట్ అయింది. శంకర్ ‘ఇండియన్ 2’ వల్ల మరింత డిలే అవుతోంది. అయితే సంక్రాంతి వరకు రెడీ అవుతుందని అంటున్నారు. కానీ ఇప్పటి వరకు దిల్ రాజు ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించలేదు. ఒకవేళ సంక్రాంతికి ఆర్సీ 15 వస్తే మాత్రం.. ప్రభాస్‌తో గట్టి పోటీ తప్పదు. కాబట్టి ఆర్సీ 15 మందుకొస్తుందా.. లేదంటే 2024 సమ్మర్‌కి వెళ్తుందా.. లేక ప్రాజెక్ట్ కెతో పోటీకి రెడీ అవుతుందా.. అనేది ఆసక్తికరంగా మారింది. మరి దిల్ రాజు ఎలాంటి ప్లాన్ చేస్తాడో చూడాలి.