హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ కేమరూన్ ఇటీవలె అవతార్ 2తో బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించాడు. దాదాపు రెండు దశాబ్దాదాలకు పైగా అవతార్2కే సమయాన్ని కేటాయించాడు. అందుకు తగ్గట్టే భారీ వసూళ్లను రాబట్టింది. అయితే డివైడ్ టాక్ రావడం వల్ల.. బాక్సాఫీస్ దగ్గర అవతార్2 సునామీ మిస్ అయింది. అయినా అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ అవతార్3, 4, 5కు భారీ క్రేజ్ ఉంది. అయితే అవతార్ 2 హవా తగ్గకముందే.. మరోసారి తన కల్ట్ క్లాసిక్ టైటానిక్‌తో థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు జేమ్స్ కామెరూన్. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు చూసిన సినిమా ఏదైనా ఉంటే.. అది టైటానిక్ అనే చెప్పొచ్చు. 1997లో వచ్చిన టైటానిక్.. అప్పట్లో సంచలన విజయం అందుకుంది. ఓ అద్భుతమైన ప్రేమ కావ్యంగా చరిత్రలో నిలిచిపోయింది. హీరో, హీరోయిన్లు లియోనార్డో డికాప్రియో, కేట్ విన్ స్లెట్లకు భారీ క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా కేట్ విన్ స్లెట్ అందానికి ముగ్దులైపోయారు. అందుకే పాతికేళ్ల తర్వాత మరోసారి టైటానిక్‌ని రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రం విడుదలై 25 ఏళ్ళు పూర్తి కావస్తుండడంతో.. చిత్ర నిర్మాణ సంస్థ పారామౌంట్ రీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. వాలైంటెన్స్ డే సందర్భంగా.. నాలుగు రోజులు ముందు.. అంటే ఫిబ్రవరి 10న వరల్డ్ వైడ్‌గా టైటానిక్ రీ మాస్టర్ వెర్షన్ 3డి సహా 4కే లలో థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. దాంతో మరోసారి టైటానిక్‌ను థియేటర్లో చూసేందుకు ఎదురు చూస్తున్నారు ఈ జనరేషన్ ప్రేమికులు. మరి టైటానిక్ రీ రిలీజ్.. వసూళ్ల పరంగా మరోసారి ఎలాంటి సంచలనం క్రియేట్ చేస్తుందో చూడాలి.