వీరసంహారెడ్డి పై గంటగంటకు భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాస్ మొగుడుగా రచ్చ రచ్చ చేస్తున్నాడు బాలయ్య. జై బాలయ్య, సుగుణ సుందరి, మా బావ మనోభావాలు వంటి సాంగ్స్ తర్వాత.. మాస్ మొగుడుగా వచ్చాగు బాలయ్య. ఇక ఈ సాంగ్ చూసిన తర్వాత బాలయ్య ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. తమన్ మ్యూజిక్ అందించిన ఈ పాట పక్కా మాస్ నంబర్‌గా ఉంది. ఈ పాటలో డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్.. బాలయ్యతో అదిరిపోయే స్టెప్పులు వేయించాడు. శృతి హాసన్ గ్లామర్, బాలయ్య మాసివ్ స్టెప్పులు ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి. బాలయ్యను తమకు నచ్చే విధంగా చూపిస్తున్నందుకు.. డైరెక్టర్ గోపీచంద్ మలినేనికి థ్యాంక్స్ చెబుతున్నారు నందమూరి ఫ్యాన్స్. జస్ట్ లిరికల్ వీడియోనే ఇలా ఉంటే.. ఇక థియేటర్లో ఫుల్ వీడియో సాంగ్ పడితే.. ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. పైగా ఈ పాటలో అన్నగారు, నందమూరి తారకరామారావుగారి ప్రస్థావన కూడా ఉండడంతో.. థియేటర్లు బ్లాస్ట్ అవడం పక్కా. ఇకపోతే.. ఓవర్సీస్ మార్కెట్లో వీరసింహారెడ్డిగారు క్రేజ్ మామూలుగా లేదంటును్నారు. బాలయ్య కెరీర్లోనే ఏ సినిమాకు రానీ రెస్పాన్స్ ఈ చిత్రానకి వస్తోంది. యూఎస్ బాక్సాఫీస్ దగ్గర వీరసింహా రెడ్డి బుకింగ్స్ అదరిపోయేలా ఉందంటున్నారు. తాజాగా 4 లక్షల డాలర్స్ క్రాస్ చేసినట్టుగా.. అక్కడి డిస్ట్రిబ్యూషన్ సంస్థ శ్లోక ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించారు. దీంతో రిలీజ్ వరకు వీరసింహారెడ్డి మరింత దుమ్ముదులపడం ఖాయమంటున్నారు. మరి వీరసింహా రెడ్డి వీరంగం ఎలా ఉంటుందో తెలియాలంటే.. ఇంకో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే.