Sree Leela : ఏ ముహూర్తాన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందో గానీ.. అతి తక్కువ సమయంలోనే.. ఊహించని క్రేజ్, ఆఫర్స్ సొంతం చేసుకుంటోంది శ్రీలీల. ఎంతలా అంటే.. ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం శ్రీలీల నామస్మరణే చేస్తోంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా..
ఏ ముహూర్తాన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందో గానీ.. అతి తక్కువ సమయంలోనే.. ఊహించని క్రేజ్, ఆఫర్స్ సొంతం చేసుకుంటోంది శ్రీలీల. ఎంతలా అంటే.. ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం శ్రీలీల నామస్మరణే చేస్తోంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా.. తమ సినిమాల్లో హీరోయిన్గా ఆమెనే కావాలంటున్నారు హీరోలంతా. దాంతో ఈ ట్రెండీ బ్యూటీ దగ్గరికి భారీ ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అసలు ఇప్పుడు శ్రీలీల లైనప్ చూస్తే దిమ్మ తిరగాల్సిందే. ఇప్పటికే ఏకంగా 8 సినిమాలకు సైన్ చేసింది. ఇంకా చాలా ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, మహేష్ బాబు SSMB28తో పాటు NBK108లో బాలయ్య కుతురిగా నటిస్తోంది. ఇక టైర్ 2 హీరోల సినిమాలు అరడజనుకు పైగానే ఉన్నాయి. విజయ్ దేవరకొండ, రామ్, నితిన్, నవీన్ పోలిశెట్టి, వైష్ణవ్ తేజ్ వంటి యంగ్ హీరోలతోను రొమన్స్ చేస్తోంది. ఈ లెక్కన ఈ బ్యూటీ.. పూజ హెగ్డే, రష్మిక, కృతిశెట్టి లాంటి వాళ్ళకు ఆఫర్లు లేకుండా చేస్తున్నట్టే. అంతేకాదు పారితోషికం కూడా భారీగా పెంచేసినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు కోటి వరకే ఉన్న ఈ బ్యూటీ.. అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ కోసం ఏకంగా కోటిన్నర వరకు డిమాండ్ చేస్తోందట. అమ్మడి క్రేజ్ చూసి మేకర్స్ సైతం అంత మొత్తంలో ఇచ్చేందుకు వెనకాడడం లేదట. ఇక ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాలు రిలీజ్ అయి.. బ్లాక్ బస్టర్స్‌గా నిలిస్తే రెమ్యూనరేషన్ డబుల్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి మున్ముందు ఈ హాట్ బ్యూటీ ఇంకెంత డిమాండ్ చేస్తుందో చూడాలి.